సంక్రాంతి వేడుకల్లో సీఎం జగన్‌ దంపతులు

AP CM YS Jagan Participates Sankranti 2023 Celebrations Updates - Sakshi

12:01PM
సీఎం జగన్‌.. నవరత్నాలతో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను అందించిన నేపథ్యంలో గ్రామ సచివాలయం, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలు తదితర సేవల ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని సాక్షాత్కారం చేసిన తీరును సాంస్కృతిక కార్యక్రమం ద్వారా కళ్ల కట్టారు.

11: 45AM
సింగర్‌ హారిక నారాయణ్, ప్రముఖ జానపద గాయని కనకవ్వ తదితర కళాకారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మంచి జోష్‌తో పాటలు పాడి వీరు.. ఈ వేడుకలకు మరింత అందం తెచ్చారు. 

11:38AM
ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో కొమ్మా ఉయ్యాల కోన జంపాల.. పాట పాడిన  చైల్డ్‌ సింగర్‌ ప్రకృతి రెడ్డి. అనంతరం సీఎం జగన్‌ ఆశీర్వాదం తీసుకున్న చిన్నారి.. సీఎం జగన్‌ దంపతులతో సెల్ఫీ కూడా దిగింది.

11:20AM
‘శ్రీనివాస కల్యాణం’ ప్రదర్శన..  తిలకించిన సీఎం జగన్‌ దంపతులు
ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారుడు ఆనంద్‌ నేతృత్వంలో  ఏర్పాటు చేసిన ‘శ్రీనివాస కల్యాణం’ ప్రదర్శనను సీఎం జగన్‌ దంపతులు తిలకిస్తున్నారు.

10:49AM
గోశాలలో గోపూజ చేసిన సీఎం జగన్‌ దంపతులు
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇంట సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి.  సీఎం జగన్‌ దంపతులు ముందుగా జ్యోతిని వెలిగించి సంక్రాంతి సంబరాల్ని ప్రారంభించారు. అనంతరం గోశాలలో గోపూజ చేశారు సీఎం జగన్‌ దంపతులు.  ఆపై భోగి మంటను వెలిగించిన సీఎం జగన్‌.. హరిదాసు కీర్తనలు ఆలకించి ఆశీర్వాదం తీసుకున్నారు. 

రైతులు, పల్లె ప్రజలతో కలిసి ఏటా సంక్రాంతి వేడుకలు నిర్వహించుకోవడం సీఎం జగన్‌కు ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ వేడుకల నిర్వహిస్తున్నారు. 

రైతులు, పల్లె ప్రజలతో కలిసి ఏటా సంక్రాంతి వేడుకలు నిర్వహించుకోవడం సీఎం జగన్‌కు ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ వేడుకల నిర్వహిస్తున్నారు. 

సంక్రాంతి సంబరాల్లో భాగంగా సీఎం జగన్‌ ఇంటి ఆవరణలో భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాట్లు చేశారు. వ్యవసాయ సామగ్రి, ఎడ్ల బండ్లు, గడ్డి వాములు, పశుసంపద, కుల వృత్తుల చిత్రాలతో పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేశారు.

ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పర్యవేక్షణలో ఈ సంబరాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి.. నవరత్నాలతో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను అందించిన నేపథ్యంలో గ్రామ సచివాలయం, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలు తదితర సేవల ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని సాక్షాత్కారం చేసిన తీరును కళ్లకు కట్టనున్నారు. ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారుడు ఆనంద్‌ నేతృత్వంలో ‘శ్రీనివాస కల్యాణం’ ప్రదర్శిస్తారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో కొమ్మా ఉయ్యాల కోన జంపాల.. పాట పాడిన గాయని ప్రకృతి రెడ్డి, అదే సినిమాలో ఎత్తర జెండా.. పాట పాడిన హారిక నారాయణ్, ప్రముఖ జానపద గాయని కనకవ్వ తదితర కళాకారులు ఈ వేడుకల్లో పాలుపంచుకోనున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top