అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తుకు సీఎం జగన్ నిర్ణయం

Antarvedi Chariot Burns CM Jagan Orders CBI Probe - Sakshi

హోం శాఖకు లేఖ పంపిన రాష్ట్ర డీజీపీ కార్యాలయం

సాక్షి, అమరావతి: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని రథం అగ్నికి ఆహుతైన అంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్‌గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కేసు దర్యాప్తును రాష్ట్ర పోలీసులు సవాలుగా తీసుకున్నారు. అయినా కూడా కొన్ని రాజకీయ శక్తులు, బృందాలు ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వంపై లేనిపోని అబద్ధాలను ప్రచారం చేస్తూ, ప్రెస్ మీట్లలోను, సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాల్సిందేనన్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి విచారణకైనా తాము సిద్ధమేనని ప్రకటించింది. (చదవండి: రథం చుట్టూ రాజకీయం!)

అంతేకాక కొన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు సీబీఐ విచారణను డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. ప్రభుత్వం ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం జగన్‌ రాష్ట్ర డీజీపీని ఆదేశించడమైనది. అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరుతూ రాష్ట్ర డీజీపీ కార్యాలయం హోం శాఖకు లేఖ పంపింది. ఇందుకు సంబంధించి రేపు (శుక్రవారం) జీవో వెలువడనుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top