రాజాం అబ్బాయి.. అమెరికా అమ్మాయి

Andhra Man Marries American Girl in Indian Traditional Style - Sakshi

వివాహ బంధంతో ఒక్కటైన ప్రేమజంట

రాజాం సిటీ: వారి ప్రేమకు హద్దుల్లేవు. ఎల్లలు దాటిన వారి ప్రేమను ఇరువురి కుటుంబసభ్యుల అంగీకారంతో పండించుకున్నారు. ఈ నేపథ్యంలో రాజాంలోని ఓ ప్రైవేట్‌ కల్యాణమంటపంలో ఆ ప్రేమ జంటకు వివాహం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. రాజాం పట్టణంలోని కూరాకులవీధికి చెందిన కందుల కిరణ్‌ బీటెక్‌ పూర్తి చేసి ఎంఎస్‌ చదివేందుకు అమెరికాలోని ఓహియో రాష్ట్రానికి వెళ్లాడు. అక్కడే బీబీఏ చదువుతున్న మోర్గాన్‌ బ్రింక్‌ (మహిగా ఇక్కడ మార్చిన పేరు)తో పరిచయం ఏర్పడి ప్రేమ చిగురించింది.

ఇద్దరూ చదువుల అనంతరం  మిచిగాన్‌ రాష్ట్రంలో  వేర్వేరు  కంపెనీల్లో ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వారి ప్రేమగా విషయాన్ని కుటుంబ సభ్యుల కు తెలియజేశారు. తొలుత అమ్మాయి తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపినప్పటికీ  కొన్నాళ్ల తరువాత ఇరువురి కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించారు. ముందుగా అమెరికాలో వారి సంప్రదాయం ప్రకారం ఆ ప్రేమ జంట వివాహం జరిగింది.

భారతీయ సంప్రదాయం ప్రాకారం వివాహం చేసుకోవాలనే అమ్మాయి కోరిక మేరకు రాజాం పట్టణంలో వివాహం చేసుకోవాలని నిశ్చయించినప్పటికీ కోవిడ్‌ కారణంగా రెండేళ్లపాటు వివాహాన్ని వాయిదా వేసుకున్నారు. ఇన్నాళ్లకు ముహూర్తం ఖరారు చేసుకుని రాజాంలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో అమ్మాయిఒ తల్లిదండ్రులు టీనా బ్రింక్, ఎరిక్‌ బ్రింక్, అబ్బాయి తండ్రి కందుల కామరాజు, ఇతర కుటుంబసభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు.  

చదవండి: (Visakhapatnam: ఇన్ఫోసిస్‌ @ వైజాగ్‌!)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top