సీఎం జగన్‌ను కలిసిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ | Amaravati: Yarlagadda Lakshmi Prasad Met Cm Ys Jaganmohanreddy | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ను కలిసిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌

Jun 9 2021 6:37 PM | Updated on Jun 9 2021 7:29 PM

Amaravati: Yarlagadda Lakshmi Prasad Met Cm Ys Jaganmohanreddy - Sakshi

సాక్షి, అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ క్యాంప్‌ కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వార్షిక నివేదికను సీఎంకు సమర్పించారు. కోవిడ్‌–19 నివారణ చర్యల కోసం అధికార భాషా సంఘం తరపున రూ.5 లక్షలు విరాళాన్ని  ఛైర్మన్‌, సభ్యులు మోదుగుల పాపిరెడ్డి, షేక్‌ మస్తాన్‌లు సీఎంకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో ఐదేళ్లపాటు అధికార భాషా సంఘమే లేదన్నారు. వైఎస్ జగన్‌ సీఎం అయ్యాక అధికార భాషా సంఘం ఛైర్మన్‌ను నియమించారన్నారు. అధికారిక కార్యకలాపాల్లో తెలుగుభాష అమలుపై  పర్యవేక్షణ చేయమని సీఎం జగన్‌ ఆదేశించారన్నారు. 

చదవండి: సీఎం జగన్‌ను కలిసిన ‘డీఎస్సీ-2008’ అభ్యర్థులు
 

Advertisement
 
Advertisement
Advertisement