సమస్యలు పరిష్కరించాలంటూ రాజధాని రైతుల ధర్నా | Amaravati Capital farmers dharna demanding resolution of problems | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించాలంటూ రాజధాని రైతుల ధర్నా

Mar 24 2026 5:51 AM | Updated on Mar 24 2026 5:51 AM

Amaravati Capital farmers dharna demanding resolution of problems

తాడికొండ: రాజధానిలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రైతులు, రైతు కూలీలు సోమ­వారం తుళ్లూరు మండలం రాయపూడిలో ధర్నా చేశారు. సీఆర్డీఏ అడిషనల్‌ కమిషనర్‌ భార్గవ తేజకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజధాని రైతులకు, పేదలకు ఇచ్చే వార్షిక కౌలు, పెన్షన్లను మరో పదేళ్ల పాటు పొడిగిం­చాలని, పేదలకు ఇచ్చే పెన్షన్‌ను రూ.10 వేలకు పెంచాలని డిమాండ్‌ చేశా­రు. రిటర్నబుల్‌ ప్లాట్ల విషయంలో వచ్చే సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరారు. ధర్నాలో సీఐటీయూ, రాజధాని అభివృద్ధి వేదిక నేతలు వై.నేతాజీ, ఎం.రవి,  లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.    

Advertisement
 
Advertisement
Advertisement