స్ప్రింక్లర్ల దొంగలను పట్టించిన రైతులు | - | Sakshi
Sakshi News home page

స్ప్రింక్లర్ల దొంగలను పట్టించిన రైతులు

Jun 13 2026 7:38 AM | Updated on Jun 13 2026 7:38 AM

గుంతకల్లు రూరల్‌: పొలాల్లో స్ప్రింక్లర్లు, పైపులు ఎత్తుకెళ్లే దొంగలు, వాటిని కొనుగోలు చేసే మరో వ్యక్తిని రూరల్‌ పోలీసులకు రైతులు శుక్రవారం పట్టించారు. రైతులు, రూరల్‌ ఎస్‌ఐ బాలముని తెలిపిన మేరకు.. నక్కనదొడ్డి, తిమ్మాపురం, నల్లదాసరపల్లి, చుట్టుపక్కల గ్రామాల్లో ఐదారునెలలుగా స్ప్రింక్లర్లు, పైపులు చోరీకి గురవుతున్నాయి. అప్పలనాయుడు అనే వ్యక్తి రాజమండ్రి నుంచి వలస వచ్చి తిమ్మాపురం సమీపంలో నర్సరీ, భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. స్ప్రింక్లర్లు, పైపులు కొనుగోలు చేసి, వాటిని తన పొలానికి ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. పూర్తి వివరాలు ఆరాతీయగా.. తిమ్మాపురానికి చెందిన వినోద్‌, మరికొందరితో కలిసి రైతుల పొలాల్లో స్ప్రింక్లర్లు, పైపులను చోరీ చేసి, వాటిని అప్పలనాయుడుకు విక్రయించేవారు. వాటిని గుర్తించిన రైతులు సుమారు 50 మందికి పైగా శుక్రవారం రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు వినోద్‌, అప్పలనాయుడును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

ఆటో డ్రైవర్‌పై

వేటకొడవళ్లతో దాడి

బుక్కరాయసముద్రం: చెన్నంపల్లికి చెందిన మణికంఠ అనే ఆటో డ్రైవర్‌పై బొమ్మలాటపల్లి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు వేటకొడవళ్లతో శుక్రవారం రాత్రి దాడి చేశౠరు. పోలీసులు తెలిపిన మేరకు..గ్రామానికి చెందిన మణికంఠ అనంతపురం – నార్పల రూట్లో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మణికంఠ శుక్రవారం రాత్రి నార్పల నుంచి చెన్నంపల్లికి ఆటోలో వెళ్తుండగా.. బొమ్మలాటపల్లి సమీపంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఆటోను అటకాయించి, మణికంఠపై వేట కొడళ్లతో దాడి చేసి, అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులు 108 వాహనం ద్వారా చికిత్ర నిమిత్తం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement