ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించండి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించండి

Jun 13 2026 7:38 AM | Updated on Jun 13 2026 7:38 AM

బెళుగుప్ప: ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు జిల్లా కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ సూచించారు. శుక్రవారం వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో కాలువపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో విద్యార్థుల అడ్మిషన్లు, ఎన్‌రోల్‌మెంట్‌ను కలెక్టర్‌ తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం, విద్యార్థి కిట్లను కలెక్టర్‌ పంపిణీ చేశారు. గుత్తి డివిజన్‌ ఎడ్యుకేషన్‌ అధికారి లక్ష్మన్న, ఎంఈఓలు గోవిందరాజులు, హరికృష్ణ, హెచ్‌ఎం సుధామణి, డీటీ గురుబ్రహ్మ పాల్గొన్నారు.

సమస్యలు లేని గ్రామంగా తీర్చుదిద్దుతాం

గుమ్మఘట్ట: రెవెన్యూ సమస్యలు లేని గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ సూచించారు. శుక్రవారం రాయదుర్గం మండలంలోని 74 ఉడేగోళం ఆర్డీటీ ఫీల్డ్‌ ఆఫీస్‌లో నిర్వహించిన ఒక నెల, ఒక నియోజకవర్గం, నాలుగు సందర్శనల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజల నుంచి 48 వినతులు ప్వీకరించారు. మొదటి వారంలో 36, రెండో వారంలో 28,మూడో వారంలో 23, నాల్గో వారంలో 61 వినతులు స్వీకరించారు. మొత్తం 135 వినతుల్లో ఇప్పటికే 67 వినతులకు పరిష్కరించినట్లు తహసీల్దార్‌ సూర్యప్రతాప్‌ తెలిపారు. కళ్యాణదుర్గం ఆర్డీఓ వసంతబాబు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement