దుర్మార్గం.. అత్యంత హేయం
● కూటమి సర్కారుపై జర్నలిస్టు సంఘాల మండిపాటు
● ‘సాక్షి’ ఎడిటర్‌పై వేధింపులు సిగ్గుచేటంటూ విమర్శలు
● మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికే కుట్రకు తెరలేపారని ధ్వజం
అనంతపురం: ఏపీలో పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు పడ్డాయి. కూటమి ప్రభుత్వంలో ‘సాక్షి’పై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై వార్తలు రాస్తున్నారనే అక్కసుతో ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డిపై పోలీసులు వేధింపు చర్యలకు దిగారు. సోదాల పేరుతో గురువారం విజయవాడలోని ధనుంజయ రెడ్డి ఇంటికి చేరుకున్న పోలీసులు.. ఎలాంటి నోటీసులు లేకుండానే లోపలికి ప్రవేశించి కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేశారు. తలుపులు మూసివేసి గంటల తరబడి సోదాల పేరుతో హల్‌చల్ చేశారు. ఈ క్రమంలో కూటమి సర్కారు నిరంకుశ ధోరణిపై జిల్లా జర్నలిస్టు సంఘాల నేతలు భగ్గుమన్నారు. పత్రికా స్వేచ్ఛపై దాడి సిగ్గుచేటంటూ మండిపడ్డారు.
పత్రికా స్వేచ్ఛపై దాడే
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నందుకే ‘సాక్షి’పై చంద్రబాబు సర్కారు కక్ష సాధింపులకు దిగుతోంది. ఇది కచ్చితంగా పత్రికా స్వేచ్ఛపై సర్కారు చేస్తున్న దాడే. ప్రజా సంఘాలతో పాటు ప్రజలు కూడా ఈ నిరంకుశత్వాన్ని ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లోకి పోలీసులు వెళ్లడం అన్యాయం.
– కొత్తపల్లి అనిల్ కుమార్ రెడ్డి,
జాప్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
పత్రికా స్వేచ్ఛను కాపాడాలి
జర్నలిస్టులపై వేధింపులకు పాల్పడటం సరికాదు. సాక్షాత్తూ ఓ పత్రిక ఎడిటర్‌ను టార్గెట్ చేయడం శోచనీయం. ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడమే.ఇప్పటికై నా పత్రికా ఎడిటర్లపై బూటకపు కేసులు ఎత్తివేయాలి. పత్రికా స్వేచ్ఛను కాపాడాలి.
– తలారి రామాంజినేయులు,
ఏపీయూడబ్ల్యూజేఎఫ్
జిల్లా గౌరవాధ్యక్షుడు
ఏపీలో విలేకరులపై దాడులు పెరిగాయి. పాత్రికేయులను దూషిస్తూ వీడియోలు పోస్ట్ చేయడం, వేధించడం నిత్య కృత్యంగా మారాయి. అధికార పార్టీకి చెందిన వారే ఇలా వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో మూలస్తంభమైన పత్రికా రంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి.
– రాచమల్లు భోగేశ్వర రెడ్డి, ఏపీయూడబ్ల్యూజే జిల్లా గౌరవాధ్యక్షుడు
విలేకరులపై దాడులు పెరిగాయి
దుర్మార్గం.. అత్యంత హేయం
దుర్మార్గం.. అత్యంత హేయం
దుర్మార్గం.. అత్యంత హేయం
దుర్మార్గం.. అత్యంత హేయం


