పోర్టుకు ఓకే..ప్యాకేజీ, ఉపాధి మాటేమిటి? | - | Sakshi
Sakshi News home page

పోర్టుకు ఓకే..ప్యాకేజీ, ఉపాధి మాటేమిటి?

Oct 16 2026 12:54 AM | Updated on Oct 16 2026 12:54 AM

● నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి ● ప్రజాభిప్రాయ సేకరణలో రైతుల డిమాండ్‌

నక్కపల్లి : మిట్టల్‌ స్టీల్‌ప్లాంట్‌, క్యాప్టివ్‌ పోర్టు నిర్మా ణాలకు తాము వ్యతిరేకం కాదని, భూములు కోల్పోయిన రైతులు, నిర్వాసితులకు న్యాయం చేయాలని పలువురు రైతులు, రాజకీయ నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం డీఎల్‌పురంలో కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అధ్యక్షతన పోర్టు నిర్మాణంపై పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఆర్సెలర్‌ మిట్టల్‌ నిప్పన్‌ స్టీల్‌ ఇండియా లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ రూ.8,174 కోట్లతో 300 ఎకరాల్లో క్యాప్టివ్‌ పోర్టు నిర్మించనున్నట్లు తెలిపారు. మొత్తం 13 బెర్త్‌లను రెండు దశల్లో నిర్మిస్తామన్నారు. తొలిదశలో 1,750 మందికి ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు. రైతులు మాట్లాడుతూ భూసేకరణ సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, పరిహారం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీల చెల్లింపుల్లో అన్యాయం జరిగిందని ఆరోపించారు. పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. మత్స్యకారులు, యాదవుల ఉపాధికి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని, మత్స్యకారులకు బెర్త్‌ కేటాయించి, గతంలో మంజూరైన జెట్టీని పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నిర్వాసితుల తరఫున వైఎస్సార్‌సీపీ నాయకులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌ పటేల్‌, ఆర్డీవోలు వి.వి.రమణ, రామలక్ష్మి, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement