నో డ్యూస్‌ సర్టిఫికెట్ల కోసం బారులు | - | Sakshi
Sakshi News home page

నో డ్యూస్‌ సర్టిఫికెట్ల కోసం బారులు

Oct 16 2026 12:54 AM | Updated on Oct 16 2026 12:54 AM

● తొలిరోజు 80 దరఖాస్తులు

యలమంచిలి రూరల్‌: మున్సిపల్‌ ఎన్నికల నగారా మోగడంతో బరిలో నిలిచే అభ్యర్థులు పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నెల 16న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రాంభమై, 18న ముగియనుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నియమ నిబంధనలు పాటించడం తప్పనిసరి. నామినేషన్ల దాఖలు దరఖాస్తుతో పాటు కొన్ని ధ్రువపత్రాలు జత చేయాలి. వీటిలో నో డ్యూస్‌ సర్టిఫికెట్‌ ఒకటి. ఈ సర్టిఫికెట్‌ కోసం గురువారం ఒక్కరోజే సుమారు 80 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ధ్రువీకరణ పత్రాల కోసం వచ్చిన దరఖాస్తుదారులతో స్థానిక మున్సిపల్‌ కార్యాలయం సందడిగా కనిపించింది. దరఖాస్తులను రెవెన్యూ విభాగం అధికారులు పరిశీలిస్తున్నారు.

శుక్రవారం నుంచి నో డ్యూస్‌ సర్టిఫికెట్లను జారీ చేయనున్నట్టు ఆర్వో టి.విశ్వేశ్వరరావు తెలిపారు. మరోవైపు నామినేషన్ల ప్రక్రియకు అవసరమైన దరఖాస్తులను పురపాలక సంఘ కార్యాలయం మొదటి అంతస్తులో సిద్ధం చేసే పనిలో అధికారులు, సిబ్బంది నిగ్నమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement