కె.కోటపాడు : వన నర్సరీల్లో సోషల్ ఫారెస్ట్ ద్వారా పెంచుతున్న మొక్కలను రైతులకు ఉచితంగా అందించనున్నట్లు ఉత్తరాంధ్ర ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ ఐ.విశ్వనాథరాజు తెలిపారు. సింగన్నదొరపాలెం, కొత్తూరు, ఎ.కోడూరు, పొడుగుపాలెం, రామచంద్రపురం, బత్తి వానిపాలెంల్లోని వననర్సరీల్లో పెంచుతున్న మొక్కల ను మంగళవారం ఆయన పరిశీలించారు. ఇళ్ల పరిసరాల్లో వేసే పూలు, పండ్ల మొక్కలతో పాటు, తులసి, కరివేపాకు, బొప్పాయి, జామ తదితర మొక్కలను వచ్చే ఏడాది నర్సరీల్లో పెంచే చర్యలను తీసుకోవా లని సిబ్బందికి ఆయన సూచించారు. 10 రకాలైన కొత్త మొక్కలను పెంచాలన్నారు. సోషల్ ఫారెస్ట్ డీఎఫ్‌వో ఎం.సోమసుందరం, ఫారెస్ట్ రేంజ్ అధికారి యు.శివరంజిని, డిప్యూటీ రేంజ్ అధికారి నూకరాజు, వన సేవకుడు చిరికి గోవింద పాల్గొన్నారు.


