రైలును ప్రారంబిస్తున్న సి.ఎం రమేష్,
కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ
అనకాపల్లి: అనకాపల్లి రైల్వే స్టేషన్‌లో రూ.18 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్, ఎంపీ సి.ఎం.రమేష్ అన్నారు. స్థానిక రైల్వే స్టేషన్‌ల్లో అనకాపల్లి–చర్లపల్లి డైలీ రైలును కలెక్టర్ విజయకృష్ణన్ ఆధ్వర్యంలో ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనకాపల్లి–చర్లపల్లి వారంతపు రైలులో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రతిరోజు నడిపేందుకు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. ఈనెల 8న అనకాపల్లి –తిరుపతి, ఈనెలాఖరున అనకాపల్లి–సోలాపూర్ రైలు ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, రైల్వే అధికారులు పాల్గొన్నారు.


