21 రోజుల్లో జనన, మరణాల రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

21 రోజుల్లో జనన, మరణాల రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

Feb 20 2026 6:50 AM | Updated on Feb 20 2026 6:50 AM

21 రోజుల్లో జనన, మరణాల రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

21 రోజుల్లో జనన, మరణాల రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

అనకాపల్లి : జనన, మరణాల రిజిస్ట్రేషన్‌ను 21 రోజుల్లో తప్పనిసరిగా నమోదు చేయించుకోవాల ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి, జిల్లా రిజిస్ట్రార్‌ ఎం.హైమావతి కోరారు. జనన, మరణాల నమోదుపై ప్రభుత్వం కొత్తగా నిబంధనలతో ఉత్తర్వులు జారీ చేసిందని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 21 రోజుల్లోగా జనన, మరణాలు నమోదు ఉచితంగా చేసుకోవచ్చునన్నారు. 21 నుంచి 30 రోజుల్లో నమోదు చేస్తే రూ.25 అపరాధ రుసుం, 30 రోజుల నుంచి ఏడాదిలోపు అయితే రూ.250, ఇది మించితే రూ.500 పెనాల్టీతోపాటు ఆర్‌డీవో అనుమతి తప్పనిసరన్నారు. బిడ్డ పేరు నమోదు చేయకపోతే 12 నెలల్లోపు ఉచితంగా నమోదు చేసుకోవచ్చునన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement