ఎవరెస్టు అధిరోహణ శిక్షణకు బధిర విద్యార్థి
గొలుగొండ: ఎవరెస్టు అధిరోహణకు సంబంధించి జాతీయ స్థాయి శిక్షణకు బధిర విద్యార్థి ఎంపికయ్యాడు. మండలంలో జోగుంపేట జిల్లా పరిషత్ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థి లెక్కల హరిశ్రీ దుర్గా ప్రసాద్ వైఎస్సార్ కడప జిల్లా గండికోటలో నెల రోజుల పాటు శిక్షణ పొందాడు. అక్కడ శిక్షణలో ప్రతిభ చూపిన మన రాష్ట్రం నుంచి 25 మంది విద్యార్థులు జాతీయ స్థాయి శిక్షణకు ఎంపికయ్యారు. వీరికి లడఖ్‌లో శిక్షణ అనంతరం ఎవరెస్టు అధిరోహణ చేయనున్నారు. జోగుంపేటకు చెందిన దుర్గా ప్రసాద్‌ను ఎంఈవో–1 సత్యనారాయణ, హెచ్‌ఎం నాగభూషణం సన్మానించారు. చెవుడు, మూగ అయిన విద్యార్థి దుర్గాప్రసాద్ చదువుల్లోనూ మంచి పేరు పొందడం ఆనందంగా ఉందన్నారు.


