22న పాఠశాలల్లో మన్‌ కీ బాత్‌ | - | Sakshi
Sakshi News home page

22న పాఠశాలల్లో మన్‌ కీ బాత్‌

Feb 20 2026 6:50 AM | Updated on Feb 20 2026 6:50 AM

22న పాఠశాలల్లో మన్‌ కీ బాత్‌

22న పాఠశాలల్లో మన్‌ కీ బాత్‌

అనకాపల్లి: బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 22న జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు మన్‌ కీ బాత్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు తెలిపారు. స్థానిక ఉడ్‌పేట పార్టీ కార్యాలయంలో మన్‌ కీ బాత్‌ పోస్టర్‌ను ఆయన గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కర్రి రామకృష్ణ మాట్లాడుతూ పిల్లలకు క్విజ్‌ పోటీ నిర్వహించి ఆకర్షణీయమైన బహుమతులు అందజేస్తామన్నారు. ప్రతి మండలం నుంచి ఐదుగురిని ఎంపిక చేసి జిల్లా స్థాయికి, అక్కడ గెలుపొందిన వారికి ఢిల్లీకి పంపిస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డేడ నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు ఈశ్వర్‌ ప్రసాద్‌, ఇ మోర్చా జిల్లా అధ్యక్షుడు సామ్రాట్‌ కుమార్‌, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు ఓరుగంటి నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement