నక్కపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ నరసింహమూర్తికి పదోన్నతి | - | Sakshi
Sakshi News home page

నక్కపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ నరసింహమూర్తికి పదోన్నతి

Feb 20 2026 6:50 AM | Updated on Feb 20 2026 6:50 AM

నక్కపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ నరసింహమూర్తికి పదోన్నతి

నక్కపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ నరసింహమూర్తికి పదోన్నతి

● అల్లూరి సీతారామరాజు జిల్లా రిజిస్ట్రార్‌గా నియామకం

సాక్షి, అనకాపల్లి: నక్కపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న సీహెచ్‌ నరసింహమూర్తికి జిల్లా రిజిస్ట్రార్‌గా పదోన్నతి లభించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా రిజిస్ట్రార్‌గా సీహెచ్‌ నరసింహమూర్తి నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 మంది సబ్‌ రిజిస్ట్రార్‌లకు జిల్లా రిజిస్ట్రార్‌లుగా పదోన్నతి కల్పిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో నక్కపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న సీహెచ్‌ నరసింహమూర్తిని జిల్లా రిజిస్ట్రార్‌గా నియమించారు. గతంలో కోటవురట్ల సబ్‌ రిజిస్ట్రార్‌గా కూడా ఆయన పనిచేశారు. ఈ మేరకు గురువారం పదోన్నతి పొందిన సీహెచ్‌ నరసింహమూర్తిని అనకాపల్లి జిల్లా రిజిస్ట్రార్‌ మన్మథరావుతో పాటు పలువురు సబ్‌రిజిస్ట్రార్లు కలిసి అభినందనలు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement