లారీ ఢీకొని తాపీమేస్త్రి మృతి
కశింకోట: స్థానిక కూడలి వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తాపీమేస్త్రి మృతి చెందాడు. ఎస్సై లక్ష్మణరావు అందించిన వివరాలు ప్రకారం.. మండలంలోని తేగాడ గ్రామానికి చెందిన నానుబిల్లి నరసింగరావు(65) మోపెడు వాహనంపై తమ గ్రామం నుంచి వస్తూ కసింకోట కూడలి వద్ద మలుపులో రోడ్డు దాటుతుండగా, అదే మార్గంలో లారీ వచ్చి ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన నరసింగరావును అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
లారీ ఢీకొని తాపీమేస్త్రి మృతి


