
‘డిజిటల్ బుక్’తో చట్టబద్ధంగా బుద్ధి చెబుతాం
మిగతా IIలో
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్
అనకాపల్లి: వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి అండగా ఉంటారని, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తల అరాచకాలకు తగిన బుద్ధి చెప్పేందుకే ‘డిజిటల్ బుక్’ను తీసుకొచ్చారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడైనా పార్టీ శ్రేణులపై కూటమి నేతలు దాడులు చేస్తే ‘డిజిటల్ బుక్–క్యూఆర్ కోడ్’లో నమోదు చేయాలని సూచించారు. స్థానిక రింగ్‌రోడ్డు పార్టీ కార్యాలయంలో ఆపార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ‘డిజిటల్ బుక్–క్యూఆర్ కోడ్’ను శనివారం ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సోమవారం మండలస్థాయిలో క్యూఆర్ కోడ్‌ను ఆవిష్కరించనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడైనా వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు జరిగినా, భూ సమస్యలు వచ్చినా తక్షణమే క్యూఆర్ కోడ్‌లో నమోదు చేయాలని తెలిపారు. వెంటనే ఓటీపీ వస్తుందని, మళ్లీ ఎంటర్ చేయడం వల్ల యాప్‌లో అప్‌లోడ్ అవుతుందన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులపై దాడులు పెరిగిపోయాయని, ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు మృతిచెందగా, 700 నుంచి 800 మందిపై కూటమి నేతలు భౌతిక దాడులు చేశారని చెప్పారు. సుమారు మూడు వేల మందిపై అక్రమ కేసులు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. కార్యకర్తలకు, నాయకులకు న్యాయం జరిగేవరకూ పోరాటాలు చేస్తామని చెప్పారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం డిజిటల్ బుక్ ఆధారంగా వారికి చట్టబద్ధంగా బుద్ధిచెబుతామని హెచ్చరించారు. కొంతమంది కూటమి ఎమ్మెల్యేలు బహిరంగంగా భూకబ్జాలు చేస్తున్నారని, కాంట్రాక్టర్ల వద్ద నుంచి అందినంత దోచుకుంటున్నారని ఆరోపించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలకు బ్రీత్‌ఎనలైజర్‌తో పరీక్షించాలన్నారు. లేని పక్షంలో తప్పని సరిగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు ఈ పరీక్ష నిర్వహించే విధంగా స్పీకర్ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మెగాస్టార్ చిరంజీవికి, బాలకృష్ణకు మధ్య చాలా వ్యత్యాసం ఉందన్నారు. 2014–19లో లేపాక్షి ఉత్సవాలు నిర్వహిస్తున్న సమయంలో చిరంజీవిని పిలవవద్దని చెప్పిన విషయాన్ని బాలకృష్ణ గుర్తుతెచ్చుకోవాలన్నారు. చిరంజీవిపై అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ విరుచుకుపడితే కనీసం జనసేన నాయకుల్లో స్పందన లేకుండా పోయిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ