
ఏరియా ఆస్పత్రిలో ఆరోగ్య శిబిరం
నర్సీపట్నం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నాయని, అందులో భాగంగానే మహిళల ఆరోగ్య పరిరక్షణకు స్వస్థ్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ఏరియా ఆస్పత్రిలో నిర్వహించిన ఆరోగ్య శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ శిబిరాల్లో మహిళలకు అన్ని రకాల స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారన్నారు. ఆయుష్మాన్– వయోవందన కార్డు ద్వారా 70 ఏళ్లు పైబడిన వారికి ఏడాదికి రూ.5 లక్షలు విలువైన వైద్య సేవలతోపాటు పెన్షన్ పొందే అవకాశం ఉందన్నారు. ఏరియా ఆస్పత్రిలో రూ.2.10 కోట్లతో వెయిటింగ్ హాల్స్ నిర్మించనున్నట్లు స్పీకర్ పేర్కొన్నారు. ఆస్పత్రిలో ఓపీ నమోదులో జాప్యం జరుగుతున్నందున అదనంగా మరో మూడు కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం ఐసీడీఎస్ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. గర్భిణులకు నిర్వహించిన సీమంతంలో పాల్గొన్నారు. ఆర్డీవో వి.వి.రమణ, తహసీల్దార్ రామారావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ వీరజ్యోతి, ఆస్పత్రి సూపరిండెంటెంట్ సుధాశారద, హా స్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు సిహెచ్. పద్మావతి, జెడ్పీటీసీ రమణమ్మ పాల్గొన్నారు.