
విశాఖ– అరకు కార్వాన్ వాహనం రెడీ
మహారాణిపేట (విశాఖ): పర్యాటక శాఖ ఆధ్వర్యంలో విశాఖ నుంచి అరకు వరకు ప్రత్యేక ప్యాకేజీ రూపంలో నడపనున్న కార్వాన్ వాహనాన్ని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ సోమవారం కలెక్టరేట్ వద్ద సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా పర్యాటక శాఖ ఆర్.డి. కల్యాణి, జిల్లా పర్యాటక శాఖ అధికారిణి జె. మాధవి, డివిజనల్ మేనేజర్ జగదీష్ కలిసి కలెక్టర్‌కు కార్వాన్ వాహనం ప్రత్యేకతలను వివరించారు. ఈ ప్రత్యేక వాహనాన్ని త్వరలోనే లాంఛనంగా ప్రారంభించి, పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు.