
కరెన్సీ నోట్లతో దుర్గమ్మకు అలంకరణ
మాకవరపాలెం: లక్ష్మీదేవి అవతారంలో శ్రీదుర్గామల్లేశ్వరస్వామి అమ్మవారు దర్శనమిచ్చారు. దుర్గాదేవి నవరాత్రుల్లో భాగంగా మండల కేంద్రంలోని బీసీ కాలనీలో గల దుర్గామల్లేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఐదో రోజైన శుక్రవారం అమ్మవారితోపాటు ఆలయంలో రూ.50 లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించినట్టు ఆలయ అర్చకులు మల్లికార్జునశర్మ తెలిపారు. దుర్గామల్లేశ్వర అమ్మవారు లక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనమివ్వడంతో కనులారా వీక్షించి పూజలు చేశారు.
లక్ష్మీదేవి అవతారంలో
దుర్గామల్లేశ్వర అమ్మవారు