
కానిస్టేబుల్ పరీక్షలో మెరిశారు
దేవరాపల్లి/చోడవరం: రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన కానిస్టేబుల్ ఫలితాల్లో పలువురు అభ్యర్థులు మంచి ర్యాంకులు సాధించారు. దేవరాపల్లి మండలంలోని తారువకు చెందిన రాయపురెడ్డి అన్వేష్ 147 మార్కులు సాధించాడు. విశాఖ గ్రామీణ విభాగంలో బీసీ–డి కేటగిరిలో అన్వేష్‌కు 12వ ర్యాంక్ లభించింది. సామాన్య రైతు కుటుంబానికి చెందిన అప్పలనాయుడు, ఈశ్వరమ్మ దంపతుల కుమారుడు అన్వేష్ ఏయూలో ఎంఎస్‌సీ పూర్తి చేశాడు. చోడవరం యువకుడు నేమాల చంద్రశేఖర్ ఉమ్మడి విశాఖజిల్లాలో 19వ ర్యాంక్ సాధించాడు. పేద కుటుంబానికి చెందిన చంద్రశేఖర్ తండ్రి పెయింటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. మొదట్నుంచీ పోలీసు కావాల న్న ఆశయంలో ఎంబీఏ వరకూ చదివిన చంద్రశేఖర్ ప్రత్యేక కోచింగ్ తీసుకొని ఏపీ కానిస్టేబుల్ పరీక్షల్లో ప్రతిభ చూపారు. 200మార్కులకు గాను 143మార్కు లు సాధించి జిల్లాలో 19వ ర్యాంకర్‌గా నిలిచారు.

కానిస్టేబుల్ పరీక్షలో మెరిశారు