
పశు పోషకుల ఆర్థిక స్థితిగతులపై బ్లాంకెట్ సర్వే
కె.కోటపాడు: కె.కోటపాడు సబ్ డివిజన్ పరిధిలోని కె.కోటపాడు, దేవరాపల్లి మండలాల్లో పశుపోషకుల ఆర్థిక స్థితిగతులపై సమగ్ర సమాచారం సేకరించే ఉద్దేశంతో బ్లాంకెట్ సర్వే చేపట్టినట్లు పశుసంవర్థక శాఖ సహాయ సంచాలకుడు డాక్టర్ ఇ.దినేష్‌కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన వారాడ, వి.సంతపాలెం గ్రామాల్లో పర్యటించి, బ్లాంకెట్ సర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు గ్రామీణ, పట్టణ ప్రాంతాలల్లో పశుపోష కులు అవసరాలు, ఆదాయ వనరులు, తదితర అంశాలపై 35 ప్రశ్నలు ఆధారంగా ఈ సర్వే గత నెల 26 నుంచి ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగుతుందన్నా రు. ఈ సర్వేలో వారాడ, వి.సంతపాలెం, పశువైద్య సహాయకురాలు సుధారాణి, మంగ పాల్గొన్నారు.