
తప్పుడు రిజిస్ట్రేషన్లపై తస్మాత్ జాగ్రత్త
కలెక్టర్ విజయ కృష్ణన్
తుమ్మపాల: తప్పుడు రిజస్ట్రేషన్లపై తరచు ఫిర్యాదు లు వస్తున్నాయని, సబ్ రిజిస్ట్రార్లు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయ కృష్ణన్ సబ్ రిజిస్ట్రార్లను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువా రం నిర్వహించని వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మా ట్లాడుతూ రెవెన్యూ రికార్డుల్లో ఆస్తి వివరాలు యజమానుల పేరున కాకుండా పొరపాటున వేరొకరి పేరున నమోదైతే అలాగే రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ఫి ర్యాదులు వస్తున్నాయని, వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. రీసర్వే జరిగిన గ్రామాల్లో ఎల్‌పీఎం ఆధారంగా రిజస్ట్రేషన్‌కు వచ్చిన ప్రతి డా క్యుమెంట్ విషయంలో లింక్, ఈసీ తప్పక చూసి పూ ర్వ యాజమాన్య హక్కులను ధ్రువీకరించుకోవాలన్నారు. జిల్లా రిజిస్ట్రార్ కె.మన్మధరావు పాల్గొన్నారు.
2న అన్నదాత సుఖీభవ
అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకాల కోసం జిల్లాలో నేటి వరకు 2,31,688 మంది రైతులను అర్హులుగా గుర్తించినట్టు కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లతో ఈ కార్యక్రమంపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.5 వేలు, పీఎం కిసాన్ కింద రూ.2 వేలు మొదటి విడతగా బ్యాంక్ ఖాతాలో జమ కానున్నాయన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహన్‌రావు, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి జి.రామారావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ కె.సత్యనారాయణ పాల్గొన్నారు.
శతశాతం ప్రవేశాలు కల్పించాలి
జిల్లాలోని అన్ని సంక్షేమ పాఠశాలలు, కళాశాలల్లో శతశాతం ప్రవేశాలు కల్పించాలని, ప్రతి రోజు పక్కాగా మెనూ అమలు చెయ్యాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీ, మోడల్ కాలేజీ, మహాత్మా జ్యోతిరావ్ పూలె వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల, మోడల్ స్కూల్స్‌లో సీట్ల భర్తీ, మెనూ అమలుపై సమీక్ష నిర్వహించారు. విద్యార్థులు గంజాయి, మత్తు పదార్ధాలకు బానిస కాకుండా చూడాల్సిన బాధ్యత వసతిగృహ అధికారులదేనన్నారు.