
రేపు కలెక్టరేట్ వద్ద ఫ్యాప్టో ధర్నా
అనకాపల్లి: రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న బోధనేతర, ఆర్థిక పరమైన 18 రకాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఈ నెల 2న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్నట్లు సంబంధిత జిల్లా చైర్మన్ బోయిన చిన్నారావు తెలిపారు. గురువారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఫ్యాప్టో జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయులపై మోయలేని భారం వేసిందన్నారు. యాప్‌లతో ఇబ్బందుకు గురిచేయడం వల్ల విద్యార్థులకు సకాలంలో బోధన చేసేందుక సమయం సరిపోవడం లేదన్నారు. ఉపాధ్యాయులను బోధనకు మాత్రమే పరిమితం చేసినట్లయితే నాణ్యమైన విద్యనందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా ప్రధాన కార్యదర్శి యేశపోగు సుధాకర్ రావు, డిప్యూటీ జనరల్ కార్యదర్శి ఎస్. దుర్గాప్రసాద్, ఏపీటీఎఫ్ ప్రతినిధి ఆచంట రవి, ఎస్‌టీయూ ప్రతినిధి వత్సవాయి శ్రీలక్ష్మి, యూటీఎఫ్ ప్రతినిధి మట్ట శ్రీనివాసరావు, ఎస్సీఎస్టీయూఎస్‌ఏపీ ప్రతినిధి వై.కిషోర్ తదితరులు పాల్గొన్నారు.