
అమ్మ చనిపోతే తల్లికి వందనం ఇవ్వరంట..
మా అమ్మ చనిపోవడంతో 9వ తరగతి చదువుతున్న నాకు, ఏడో తరగతతి చదువుతున్న నా తమ్ముడికి తల్లికి వందనం నిలిపివేశారంటూ చోడవరం టౌన్‌లోని గాంధీనగరం జెడ్పీ హైస్కూల్ విద్యార్థి మామిడిపాక శ్రీసత్యసాయి ధనోష్ వాపోయాడు. అతడు తన తండ్రి శ్రీనివాస్‌తో కలిసి కలెక్టరేట్‌లో విన్నవించుకున్నాడు. రెండేళ్ల క్రితం తల్లి మహలక్ష్మి మృతి చెందింది. ఇటీవల తల్లికి వందనం జాబితాలో మా పేర్లు రావడంతో తండ్రి బ్యాంక్ ఖాతాకు జత చేశామని, అయినా మాకు తల్లికి వందనం రాలేదని మొరపెట్టుకున్నాడు. అధికారులు పరిశీలించి తల్లికి వందనం నగదు మంజూరు చేయాలని కోరాడు.