సేంద్రియ బాటలోడ్రాగన్‌ సిరులు | - | Sakshi
Sakshi News home page

సేంద్రియ బాటలోడ్రాగన్‌ సిరులు

Jun 20 2025 5:40 AM | Updated on Jun 20 2025 5:40 AM

సేంద్

సేంద్రియ బాటలోడ్రాగన్‌ సిరులు

విభిన్నంగా ఆలోచించేవారు ఏ రంగంలోనైనా రాణిస్తారు. ధైర్యంగా చొరవతో అడుగేసేవారు విజయతీరానికి చేరుతారు. రసాయన ఎరువులకు స్వస్తి పలుకుతూ ప్రకృతి వ్యవసాయ బాటలో నడుస్తూ లాభాలు ఆర్జించవచ్చు. సేంద్రియ పద్ధతుల్లో డ్రాగన్‌ ఫ్రూట్‌ పండ్లు పండిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.. ఎ.కోడూరుకు చెందిన రైతు లెక్కల కోటేశ్వరరావు.

స్థానికంగానే అమ్మకాలు

డ్రాగన్‌ ఫ్రూట్‌ ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా దొరుకుతుంది. ఎక్కడ పండించినా పట్టణాలకు తెచ్చి విక్రయిస్తుంటారు. ప్రస్తుతం ఈ పంట ఎ.కోడూరులో సాగు చేయడంతో పాటు సేంద్రియ విధానంలో పండించడంతో కొనుగోలు చేసేందుకు స్థానిక ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. డ్రాగన్‌ ఫ్రూట్‌ను తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్న నేపథ్యంలో మండలానికి చెందిన ప్రజలతో పాటు సమీప మండలాలైన దేవరాపల్లి, వేపాడకు చెందిన వారు వచ్చి ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.

కె.కోటపాడు: కె.కోటపాడు మండలం ఎ.కోడూరులో ఐదెకరాల్లో డ్రాగన్‌ఫ్రూట్‌ సాగును రైతు కోటేశ్వరరావు మూడేళ్ల క్రితం ప్రారంభించారు. మొదటి ఏడాది సాగు ప్రారంభంలో దుక్కులు, డ్రాగన్‌ మొక్కల కొనుగోలు, సిమెంట్‌ స్తంభాలు, వైర్లుతో పాటు ఇతర కూలి ఖర్చులకు ఎకరానికి రూ.6 లక్షల నుంచి రూ.7లక్షల వరకూ ఖర్చు అవుతుంది. 8 నుంచి 12 నెలల మధ్య పంట చేతికొస్తుంది. ప్రతి ఏడాది డ్రాగన్‌ ఫ్రూట్‌ పంట దిగుబడి జూన్‌లో ప్రారంభమై నవంబర్‌ వరకూ ఉంటుంది. మొదటి ఏడాది 5 ఎకరాల్లోను 3 టన్నుల దిగుబడి, రెండో ఏడాది 15 టన్నుల దిగుబడి వచ్చిందని రైతు కోటేశ్వరరావు తెలిపారు. ఈ ఏడాది చెట్లకు డ్రాగన్‌ ఫ్రూట్‌ కాపు బాగుండడంతో 35 టన్నుల వరకూ దిగుబడి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మొక్కలకు జీవామృతంతో ఊపిరి

కోటేశ్వరరావు సేంద్రియ విధానంలో డ్రాగన్‌ ఫ్రూట్‌ను సాగు చేస్తున్నారు. దీంతో మార్కెట్‌లో మంచి డిమాండ్‌, మద్దతు ధర పలుకుతోంది. ఆవు పేడ, కోడి గెత్తంను డ్రాగన్‌ ఫ్రూట్‌ మొక్కల మొదళ్ల వద్ద వేయడంతో మొక్కలు ఆరోగ్యంగా ఎదుగుతున్నాయి. గోమూత్రం, బెల్లం, శనగపిండి, ఆవు పేడ, పుట్టమన్నును వారం రోజుల పాటు నిల్వ ఉంచి తయారు చేసిన జీవామృతంను డ్రిప్‌ విధానం ద్వారా డ్రాగన్‌ ఫ్రూట్‌ మొక్కలకు అందిస్తున్నారు. తద్వారా పంటకు తెగుళ్ల బెడద తప్పింది. రసాయన ఎరువులకయ్యే ఖర్చు చాలా వరకు తగ్గింది.

ఎ.కోడూరులో ఐదెకరాల్లో డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు స్థానికంగానే మంచి డిమాండ్‌ ఆదర్శంగా నిలుస్తున్న రైతు కోటేశ్వరరావు

ఆసక్తి ఉంటే సాగు సూచనలు

డ్రాగన్‌ ఫ్రూట్‌ పంటను సేంద్రియ విధానంలో చేపడుతున్నా. సేంద్రియ ఎరువులు, జీవామృతం వాడడం వల్ల పంట దిగుబడి బాగుంది. పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు పొలం వద్దకే వస్తున్నారు. డ్రాగన్‌ ఫ్రూట్‌ పంట సాగుపై ఆసక్తి ఉన్న వారికి సలహాలు, సూచనలు చేస్తా. సాగు ప్రారంభంలో పెట్టుబడి ఖర్చులు ఎక్కువగా అయినా.. తదుపరి దిగుబడి ప్రారంభమైతే తరువాత ఏడాది నుంచి ఆదాయం పొందవచ్చును. కిలో డ్రాగన్‌ఫ్రూట్‌ రూ.150కు విక్రయిస్తున్నా. ఫోన్‌ నంబర్‌ 98663 81817లో సంప్రదిస్తే సాగుకు అవసరమైన సూచనలు చేస్తా.

–లెక్కల కోటేశ్వరరావు, సాగు రైతు, ఎ.కోడూరు

సేంద్రియ బాటలోడ్రాగన్‌ సిరులు1
1/4

సేంద్రియ బాటలోడ్రాగన్‌ సిరులు

సేంద్రియ బాటలోడ్రాగన్‌ సిరులు2
2/4

సేంద్రియ బాటలోడ్రాగన్‌ సిరులు

సేంద్రియ బాటలోడ్రాగన్‌ సిరులు3
3/4

సేంద్రియ బాటలోడ్రాగన్‌ సిరులు

సేంద్రియ బాటలోడ్రాగన్‌ సిరులు4
4/4

సేంద్రియ బాటలోడ్రాగన్‌ సిరులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement