మాగాణి భూమూల్లో ఆయిల్‌ పామ్‌ మేలు | - | Sakshi
Sakshi News home page

మాగాణి భూమూల్లో ఆయిల్‌ పామ్‌ మేలు

Jun 19 2025 4:32 AM | Updated on Jun 19 2025 4:32 AM

మాగాణ

మాగాణి భూమూల్లో ఆయిల్‌ పామ్‌ మేలు

మాగాణి భూముల్లో ఆయిల్‌ పామ్‌ తోటలు వేసుకోవడం ఎంతో శ్రేయస్కరం. ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి. ఆయిల్‌పామ్‌ తోటలో అంతర పంటగా కోకో, అరటి కూడా సాగు చేసుకోవచ్చు. రెండేళ్ల వ్యవధిలో పామాయిల్‌ సాగు విస్తీర్ణం మండలంలో పెరిగింది. ఫ్రూట్‌ ధర తగ్గినా ఈ పంట పండించాలని రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. –వి.భానుపుష్పలీలావతి, మండల ఉద్యానవన శాఖాధికారి, మాడుగుల మండలం

రైతులకు 15 రోజులకొకసారి చెల్లింపులు

ఆయిల్‌పామ్‌ పండ్లు కొనుగోలు చేసిన కంపెనీలు ప్రతి 15 రోజులకొకసారి చెల్లింపులు జరుపుతున్నాయి. మాడుగుల మండలంలో తాటిపర్తి నుంచి శంకరం మధ్యలో కాటా దగ్గర రైతుల నుంచి ఫ్రూట్‌ కొనుగోలు చేస్తున్నాం. అనంతరం బంగారమెట్ట వద్ద గల ఆయిల్‌పామ్‌ కంపెనీకి తరలిస్తాం.

–జి.వి.దుర్గారావు, ఆయిల్‌ పామ్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్‌, మాడుగుల మండలం

అంతర పంటలతో అధిక ఆదాయం

ఆయిల్‌పామ్‌లో అంతర పంటలుగా కోకో, అరటి తోటలు వేసుకోవచ్చు. దీని వల్ల అధిక ఆదాయం పొందవచ్చు. కోకో పంట కూడా నాలుగేళ్ల తర్వాత పక్వానికి వస్తుంది. ప్రభుత్వం కల్పిస్తున్న డ్రిప్‌ ఇరిగేషన్‌, ఇతర రాయితీలను సద్వినియోగం చేసుకుంటున్నాం.

–బండారు శ్రీరాములు, రైతు, బావన్నపాలెం, మాడుగుల మండలం

జిల్లాలో పెరుగుతున్న సాగు

ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణం జిల్లాలో గణనీయంగా పెరుగుతుంది. గిరిజన, మైదాన గ్రామాల్లో సాగు చేస్తున్నారు. జిల్లాలో 19,500 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగవుతోంది. హెక్టారుకు రూ.5,250 చొప్పున నాలుగు సంవత్సరాల పాటు రాయితీ కల్పిస్తున్నాం. ఈ నగదు ఎరువుల వినియోగం కోసం రైతు ఖాతాకు జమ చేస్తాం.

–జి.ప్రభాకర్‌రావు, ఉద్యానవన శాఖాధికారి, అనకాపల్లి జిల్లా

మాగాణి భూమూల్లో ఆయిల్‌ పామ్‌ మేలు 
1
1/2

మాగాణి భూమూల్లో ఆయిల్‌ పామ్‌ మేలు

మాగాణి భూమూల్లో ఆయిల్‌ పామ్‌ మేలు 
2
2/2

మాగాణి భూమూల్లో ఆయిల్‌ పామ్‌ మేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement