108లో ప్రసవం | - | Sakshi
Sakshi News home page

108లో ప్రసవం

Jun 15 2025 7:57 AM | Updated on Jun 15 2025 7:57 AM

108లో ప్రసవం

108లో ప్రసవం

● తల్లీ బిడ్డ క్షేమం

చీడికాడ: గిరిజన పంచాయతీ గోప్పూరుకు చెందిన విజయ 108 వాహనంలో శుక్రవారం రాత్రి పండంటి బిడ్డను ప్రసవించింది. నెలలు నిండి పురిటి నొప్పులు పడుతున్న ఆమెను చీడికాడ పీహెచ్‌సీకి 108లో తరలిస్తుండగా.. వాహనం ఖండివరం సమీపానికి చేరుకునే సమయానికి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో 108 వాహన డ్రైవర్‌ లెక్కల ముత్యాలనాయుడు వాహనాన్ని ఆపడంతో ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌ కమలాదేవి వాహనంలోనే ఆమెకు సుఖ ప్రసవం జరిపారు. విజయ పాపకు జన్మనిచ్చింది. 108 సిబ్బంది తల్లీ బిడ్డలను చీడికాడ పీహెచ్‌సీలో చేర్పించారు. ఇద్దరూ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు ఈఎంటీ కమలాదేవి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement