వడ్డాది వెంకన్న ఆలయ ట్రస్ట్‌బోర్డు ప్రమాణ స్వీకారం | - | Sakshi
Sakshi News home page

వడ్డాది వెంకన్న ఆలయ ట్రస్ట్‌బోర్డు ప్రమాణ స్వీకారం

Aug 28 2026 12:27 AM | Updated on Aug 28 2026 12:27 AM

బుచ్చెయ్యపేట: వడ్డాది వేంకటేశ్వరస్వామి ఆలయ నూతన ట్రస్ట్‌ బోర్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల రాష్ట్ర దేవదాయశాఖ వేంకటేశ్వరస్వామి ఆలయానికి 20 ఏళ్ల తరవాత కమిటీ సభ్యులను నియమించింది. కొత్తగా నియమితులైన సభ్యులతో గురువారం దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్‌ వసంతకుమార్‌ ట్రస్ట్‌ బోర్డు సభ్యులతో ప్రమాణం చేయించారు. వేంకటేశ్వరస్వామి సన్నిధిలోనే ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త దొండా కన్నబాబుతో పాటు ట్రస్ట్‌ బోర్డు సభ్యులుగా ఎన్నికై న సయ్యపురెడ్డి సత్యనారాయణ మూర్తి,(నవీన్‌), ఎస్‌.లక్ష్మీనారాయణ, పి.రాధ, ఎస్‌. మహాలక్ష్మి, అప్పలనరస, కె.లక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. ఈవో శర్మ, నాయకులు దొండా గిరిబాబు, శ్రీరామూర్తి, రమేష్‌, పేరమ్మ, వాసు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement