కొమ్మాది: బ్రిక్స్ దేశాల క్రీడామంత్రుల సమావేశం నేపథ్యంలో పలువురు బ్రిక్స్ ప్రతినిధులు తొట్లకొండను ఆదివారం సందర్శించారు. దీని చారిత్రక పాధాన్యతతో పాటు బౌద్ధమతంలో ఈ ప్రాంతానికి ఉన్న విశిష్టతను గైడ్ ద్వారా తెలుసుకున్నారు. నీటి తొట్టెలు, చైత్యాలు, ఆరామాలు, స్థూపాలు, మహాస్థూపం, పాకశాల, ధ్యాన కేంద్రాలను సందర్శించి, వాటి గురించి తెలుసుకున్నారు. అక్కడి నుంచి తొట్లకొండపై ఉన్న సీ వ్యూ పాయింట్ సందర్శించారు.
రుషికొండ వద్ద...
బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందిన రుషికొండ బీచ్‌ను బ్రిక్స్ దేశాల ప్రతినిధులు సందర్శించి అక్కడ అధికారులు ఏర్పాటు చేసిన తేనీటి విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక కళాకారులు సాంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. వారితో కలసి థింసా, ఇతర నృత్యాల్లో పాల్గొని, ప్రతినిధులు సందడి చేశారు.


