ప్రభుత్వ వైద్య కళాశాలలో మౌలిక వసతులు కల్పిస్తాం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ వైద్య కళాశాలలో మౌలిక వసతులు కల్పిస్తాం

Aug 23 2026 12:22 AM | Updated on Aug 23 2026 12:22 AM

పాడేరు : స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రణాళికబద్ధంగా మౌలిక వసతులు కల్పిస్తామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వీరపాండ్యన్‌ తెలిపారు. శనివారం ఆయన స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించారు. కళాశాల తరగతి గదులను, ఇతర బ్లాకులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించాలని, మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. జీజీహెచ్‌, ఎంసీహెచ్‌ ఆస్పత్రులను వైద్య కళాశాల పరిధిలోని తరలించే ప్రక్రియను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. అనంతరం ఆయన స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిని తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, రోగులకు అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. సకాలంలో రక్త పరీక్షలు చేసి ఇవ్వాలన్నారు. ఆస్పత్రిలో సెక్యూరిటీ, శానిటేషన్‌ సేవలను పరిశీలించారు. అవసరమైతే వారి సంఖ్యను పెంచాలని అధికారులను ఆదేశించారు. వైద్య సేవల్లో ఎటువంటి ఇబ్బందులకు తావు లేకుండా రోగులకు సమర్ధవంతంగా అందించాలని సూచించారు. ఆయన వెంట కలెక్టర్‌ నిశాంతి, జాయింట్‌ కలెక్టర్‌ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, జిల్లా ఆస్పత్రి సూపరిండెండెంట్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు, వైద్యులు ఉన్నారు.

రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ

వీరపాండ్యన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement