ఇద్దరు అన్నదమ్ములు జైలుకు తరలింపు
కొయ్యూరు: గంజాయి తరలింపునకు పాల్పడుతూ యువతను మత్తుకు అలవాటు చేస్తున్న ఇద్దరు అన్నదమ్ములను పీడీ చట్టం కింద అరెస్ట్ చేసి విశాఖా సెంట్రల్ జైలుకు తరలించామని సీఐ బి శ్రీనివాసరావు శవారం తెలిపారు.మర్రివాడ పంచాయతీ దొడ్డవరంకు చెందిన మాగాపు చక్రవర్తి,గంగాధర్‌లు అన్నదమ్ములు ఇద్దరు గంజాయిని ఇది వరకు తరలించారన్నారు.వారిపై ఇక్కడ పోలీసులు పంపిన నివేదిక ఆధారంగా కలెక్టర్ పీడీ చట్టం కింద అరెస్ట్‌కు ఆదేశాలు ఇచ్చారన్నారు.దీనిలో బాగంగా వారిని జైలుకు తరలించామన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నిరోధిక నిర్బంధ ఉత్తర్వులను అనుసరించిపై ఇద్దరిని జైలుకు తరలించామన్నారు. సమాజానికి, యువతకు ముప్పుగా మారిన ఇలాంటి గంజాయి స్మగ్లర్లపై మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై సైతం పీడీ చట్టాన్ని ప్రయోగిస్తామని హెచ్చరించారు.మండలంలో ఎవరైనా గంజయిని తరలించినా లేదా అక్రమంగా నిల్వ ఉంచినా నేరస్తులవుతారన్నారు.వారి జీవితాలు అంధకారమవుతాయని తెలిపారు. దీనిలో మంప ఎస్‌ఐ శ్రీనివాస్ పాల్గొన్నారు.


