● నలుగురి ఆరెస్టు
డుంబ్రిగుడ: మండలంలోని బొందుగుడ గ్రామ సమీపంలో బుధవారం పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 21 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా నుంచి ఆంధ్రా మీదుగా శాంత్రో కారులో బెంగళూరుకు గంజాయిని తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కారులో ఉన్న 11 ప్యాకెట్లలో దాచిన 21 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న వ్యక్తుల నుంచి ఒక కారు, ఒక మోటార్ సైకిల్, 6 మొబైల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ కేసులో మొత్తం నలుగురు నిందితులను అరెస్టు చేయగా, వీరిలో ఒకరు మైనర్ కావడంతో అతడిని జువైనల్ హోమ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు.


