సాక్షి,పాడేరు: మన్యంలో వర్షాలు కొనసాగుతున్నాయి.గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఏజెన్సీలోని పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు మండలాల్లో కుండపోతగా భారీ వర్షం కురిసింది. జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. మద్దిగరువు, గుత్తులపుట్టు వారపుసంతలకు ఆటంకం ఏర్పడింది. సంతకు వచ్చిన గిరిజనులంతా గొడుగులను ఆశ్రయించి తమ గ్రామాలకు సురక్షితంగా చేరుకున్నారు. ఏజెన్సీలో కురుస్తున్న వర్షాలతో మత్స్యగెడ్డ, రాళ్లగెడ్డ, చాపరాయి, దిగుడుపుట్టు, కురిడి గెడ్డలతో పాటు అనంతగిరి మండలంలోని గోస్తనీలో ప్రవాహం పెరిగింది. కొండవాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.గెడ్డల అవతల గ్రామాలను రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తం చేసింది.
ఉధృతంగా వాగులు, గెడ్డలు


