● డీటీ నుంచి పదోన్నతి
కొయ్యూరు: స్థానిక తహశీల్దారు కార్యాలయంలో డిప్యూ టీ తహసీల్దారుగా పనిచేస్తున్న వి. కుమారస్వామికి తహసీల్దారుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు ఆయనను పాడేరు సబ్ కలెక్టర్ కార్యాలయం పరిపాలనా అధికారిగా (ఏవో) నియమిస్తూ కలెక్టర్ నిషాంతి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి అనంతరం తొలుత ఆయనను డుంబ్రిగుడకు బదిలీ చేయగా, ఆ తర్వాత పాడేరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవోగా నియమిస్తూ కలెక్టర్ తాజా ఆదేశాలు ఇచ్చారు. కుమారస్వామి మూడు సంవత్సరాల క్రితం కొయ్యూరులో డీటీగా బాధ్యతలు చేపట్టి, తనదైన శైలిలో సేవలందిస్తూ ప్రజల మన్ననలు పొందారు.


