‘హైడ్రో పవర్‌’ సర్వే బృందాన్ని అడ్డుకున్న గిరిజనులు | - | Sakshi
Sakshi News home page

‘హైడ్రో పవర్‌’ సర్వే బృందాన్ని అడ్డుకున్న గిరిజనులు

Jul 10 2026 5:40 AM | Updated on Jul 10 2026 5:40 AM

అనంతగిరి (అరకులోయ టౌన్‌): మండలంలోని పెదకోట హైడ్రో పవర్‌ ప్రాజెక్టు ప్రాంతంలోని కుడియా గెడ్డ సమీపంలో సందేహాస్పదంగా సర్వే కార్యకలాపాలు చేస్తున్న బృందాన్ని స్థానిక గిరిజనులు అడ్డుకున్నారు. దీంతో ఆ బృందం అక్కడి నుంచి వెనుదిరిగినట్లు సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పాచిపెంట అప్పలనర్స ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైడ్రో పవర్‌ ప్రాజెక్టు పేరుతో స్థానిక ఆదివాసీ రైతుల భూములను కబ్జా చేసి, గిరిజనులను వెళ్లగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి రహస్య సర్వేలు, జీపీఎస్‌ పరికరాలతో పగలు, రాత్రి వేళల్లో సాగుతున్న కార్యకలాపాలు స్థానిక గిరిజనులను ఆందోళనకు గురి చేస్తున్నాయన్నారు. ఈ వ్యవహారంపై ఎస్పీ, ఆర్డీవోలు స్పందించి, సర్వే చేస్తున్న వారిపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. హైడ్రో పవర్‌ ప్రాజెక్టు పేరుతో స్థానికుల భూములు, అడవులు, వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతాలను దోపిడీ చేసే ప్రయత్నం సాగుతోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం స్థానిక ప్రజలతో సమగ్ర చర్చలు జరిపి, వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండి, ఇటువంటి అక్రమ సర్వేలు చేసే వారిని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. భూమి, జల, అడవి సంరక్షణ కోసం సీపీఎం పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని అప్పలనర్స స్పష్టం చేశారు.

బాకై ్సట్‌ తవ్వకాలను అడ్డుకుని తీరుతాం

గూడెంకొత్తవీధి: మన్యంలో బాకై ్సట్‌ తవ్వకాలను అడ్డుకుని తీరతామని సీపీఎం జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స స్పష్టం చేశారు. గురువారం గూడెంకొత్తవీధి వచ్చిన ఆయన చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల సీపీఎం నేతలతో సమావేశమయ్యారు. ఈనెల 18న సీసీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస్‌ బాకై ్సట్‌ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారన్నారు. ఆయన పర్యటనను విజయవంతం చేయాలని ఆయన కోరారు. మన్యంలో ఖనిజ తవ్వకాలకు సంబంధించి ఇప్పటికే పలు చోట్ల రహస్య సర్వేలు జరుగుతున్నాయన్నారు. వాటిని ఎక్కడికక్కడ గిరిజనులు అడ్డుకుంటున్నారని గుర్తుచేశారు. బాకై ్సట్‌, హైడ్రోపవర్‌వంటి ప్రాజెక్టులు, మైనింగ్‌ తవ్వకాల వల్ల గిరిజనుల హక్కులకు భంగం కలుగుతుందన్నారు. అడవిపై వారు హక్కు కోల్పోతారన్నారు. అడవులు నాశనం అయి వ్యవసాయానికి దూరం అయ్యే పరిస్థితులు ఎదురవుతాయన్నారు. వీటన్నింటిపైనా తమ పార్టీ ఎప్పటికప్పుడు గిరిజనులకు మేల్కొలుపుతుందన్నారు. మన్యంలో ఉన్న పరిస్థితుల దృష్యా ఓటరు జాబితా సవరణ కార్యక్రమం గడువును ప్రభుత్వం పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు చిన్నయ్యపడాల్‌, ధనుంజయ్‌, చిరంజీవి, సత్యనారాయణ, బాలయ్య, బుజ్జిబాబు పాల్గొన్నారు.

సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి

పాచిపెంట అప్పలనర్స వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement