రాష్ట్రంలో గాడి తప్పిన పాలన | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో గాడి తప్పిన పాలన

Jun 28 2026 2:32 AM | Updated on Jun 28 2026 2:32 AM

● పోలీసుల అరాచకాలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం ● సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జె.వి.సత్యనారాయణమూర్తి

అనకాపల్లి టౌన్‌ : రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడే పోలీసులే చట్టాన్ని వారి చేతుల్లోకి తీసుకుని లాకప్‌డెత్‌లు చేస్తున్న తీరు కూటమి ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనం అని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జె.వి.సత్యనారాయణ మూర్తి అన్నారు. స్ధానిక సిపిఐ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలన గాడి తప్పాయని, యుద్ధాల వల్ల నిత్యావసర ధరలు పెరిగినా కనీస చర్యలు చేపట్టలేదన్నారు. అయోధ్య రామ మందిరం హుండీ కానుకల చోరీ కేసు సిట్‌కు కాకుండా సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ వచ్చే ఆగస్ట్‌ 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రాష్ట్రంలో పాదయాత్రలు నిర్వాహించాలని, ఈ నెల 30న విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద రైతుల సమస్యలపై నిర్వహించే కార్యక్రమానికి అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబు, సహాయ కార్యదర్శి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement