పెదబయలు: మండలకేంద్రంలో రోగులపేట సమీపంలోని ఏపీ రెసిడెన్షియల్ పాఠశాల ఆవరణలో పార్క్ చేసిన పల్సర్ బైక్ చోరీకి గురైనట్లు ఆ పాఠశాల ఉపాధ్యాయుడు బిడ్డిక మహేష్ తెలిపారు. గురువారం అర్ధరాత్రి 2 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌ను దొంగిలించినట్లు ఆయన పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఇటీవల చిల్లర దొంగతనాలు పెరిగిపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గత నెలలో మోదకొండమ్మ తల్లి ఉత్సవాల సమయంలో, సీతగుంట పంచాయతీ చిట్రాయిపుట్టు గ్రామంలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. జాతరకు వెళ్లిన సమయాన్ని గమనించిన దొంగలు, ఇంటి తాళాలు పగలగొట్టి ఐదు తులాల బంగారం అపహరించారు. వరుసగా జరుగుతున్న ఈ దొంగతనాలతో భయాందోళనకు గురవుతున్న మండల ప్రజలు, పోలీసులు రాత్రిపూట గస్తీని పెంచి, నిఘా కట్టుదిట్టం చేయాలని కోరుతున్నారు.


