● ధర తగ్గడంతో పరిస్థితి దయనీయం
వారపుసంతలో విక్రయానికి తీసుకువచ్చిన పైనాపిల్
డుంబ్రిగుడ: అరకు వారపు సంతలో పైనాపిల్ ధరలు భారీగా పడిపోవడంతో మండలంలోని గిరిజన రైతులు నష్టపోతున్నారు. గత వారంతో పోలిస్తే ఈ వారం ధరలు గణనీయంగా తగ్గడం రైతులకు తీరని ఆవేదన కలిగిస్తోంది. గతంలో పెద్ద సైజు పైనాపిల్ ధర రూ. 60 నుంచి రూ. 40 వరకు ఉండగా, ఈ వారం ఆ ధర రూ. 30 నుంచి రూ. 20కి పడిపోయింది. ధరలు అకస్మాత్తుగా పతనం కావడంతో, పంటను నమ్ముకున్న గిరిజన రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.


