● రోగులకు ఉచిత భోజనంతో సేవలందిస్తున్న దంపతులు
సీలేరు ఆసుపత్రిలో రోగులకు భోజనం అందిస్తున్న బాలాజీ దంపతులు
సీలేరు: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే నిరుపేద గిరిజన రోగుల ఆకలి తీర్చడంలో బాలాజీ రెస్టారెంట్ నిర్వాహకులు నక్క జ్ఞానేశ్వర్‌రావు (బాల), ఆయన భార్య ఆదర్శంగా నిలుస్తున్నారు. సుమారు 50 గిరిజన గ్రామాలకు చెందిన రోగులు, గర్భిణుల వైద్యం కోసం ఇక్కడికి వస్తుంటారు. సరైన ఆహారం దొరకక, బయట హోటళ్లలో తినే స్థోమత లేక వారు పడుతున్న ఇబ్బందులను గమనించిన ఈ దంపతులు, ప్రతిరోజూ నేరుగా ఆసుపత్రికి వెళ్లి రోగులకు ఉచిత భోజనాన్ని అందిస్తున్నారు. ‘ఆకలితో వచ్చే ప్రతి రోగికి, వారు చికిత్స పొందే ఎన్ని రోజులైనా సరే భోజనం అందించడమే మా లక్ష్యం’ అని జ్ఞానేశ్వర్‌రావు పేర్కొన్నారు. వీరి మానవత్వాన్ని స్థానికులు అభినందిస్తున్నారు.


