రావికమతం: రైతు కుటుంబంలో పుట్టిన మాచపల్లి సంతోష్‌కుమార్ మద్రాస్ ఓషన్ స్ట్రక్చ ర్ కాలేజీలో మైరెన్ ఇంజనీరింగ్‌లో సీటు సంపాందించాడు. రావికమతం మండలం గుడ్డిప గ్రామానికి చెందిన సంతోష్‌కుమార్ ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన గేట్ పరీక్షలో సత్తా చాటి ఆలిండియాలో 6వ ర్యాంక్ సాధించాడు. ఈ ర్యాంక్ ఆధారంగా మద్రాస్ ఓషన్ స్ట్రక్చర్ కాలేజీలో మైరెన్ ఇంజనీరింగ్‌లో సీటు ఖరారు చేస్తూ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తల్లిదండ్రులు శ్రీనివాసరావు, గంగాభవాని ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థి సంతోష్‌కుమార్‌ను గ్రామ పెద్దలు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అభినందించారు.


