మాడుగుల రూరల్: మండలంలో వీరనారాయణం గ్రామానికి చెందిన మద్దాల శ్రీను(40) పాముకాటుతో శుక్రవారం మృతి చెందాడు. కృష్ణాపురంలో నీరుకొండ ప్రసాదరావుకు చెందిన పామాయిల్ తోటలో ఉదయం కూలి పనికి వెళ్లాడు. అక్కడ పని చేస్తుండగా మధ్యాహ్నం అతడి కాలిపై పాము కాటేసింది. వెంటనే మాడుగుల ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడు భార్య లక్ష్మి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారైలు ఉన్నారు. రోజూ మాదిరిగానే పామాయిల్ తోటకు పనికి వెళ్లిన శ్రీను మృతితో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.


