నర్సీపట్నం: మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా పోలీసులు, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయం నుంచి అబిద్‌సెంటర్ వరకు ఈ ర్యాలీ సాగింది. అబిద్‌సెంటర్‌లో మానవహారంగా ఏర్పడి మాదక ద్రవ్యాలను నిర్మూలిద్దాం అంటూ నినాదాలు చేశారు. పోలీసులు అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు, యువత మాదకద్రవ్యాల జోలికి పోకుండా విద్య, క్రీడలపై దృష్టి సారించాలన్నారు. మాదక ద్రవ్యాల వల్ల భవిష్యత్తు దెబ్బతింటుందన్నారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. విలువలతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకొని, సమాజ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ సీఐ గపూర్, రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ, ఎస్సైలు రమేష్, ఉమామహేశ్వరరావు, దామోదర్‌నాయుడు, రామారావు, రాజారావు, తారకేశ్వరరావు, రుషికేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు


