సాక్షి,పాడేరు: పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన గిరిజన విద్యార్థులకు గురువారం జిల్లా కలెక్టర్ నిశాంతి గిరి ప్రతిభ పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా టాపర్లుగా నిలిచిన విద్యార్థులను కలెక్టర్ అభినందిస్తూ నగదు బహుమతులు, జ్ఞాపికలను అందించారు. ప్రథమ స్థానం సాధించిన ఉబ్బేటి దీపక్‌కు రూ.10 వేలు, ద్వితీయ స్థానం సాధించిన కుర్ర తేజశ్రీకి రూ.8 వేలు, తృతీయ స్థానం సాధించిన సాంగుల సాయిజ్యోతికి రూ.5 వేలు అందజేశారు. తరువాత స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు రూ. 2,000 చొప్పున నగదు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కలెక్టర్ శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం భద్రాచలం బీఈడీ కళాశాల పూర్వ విద్యార్థులు కూడా టెన్త్ టాపర్లను సన్మానించారు.


