● ప్రిన్సిపాల్ రామ్మోహన్‌రావు
చింతపల్లి: స్థానిక ఆర్ ఐటీఐలో మొదటి విడత ప్రవేశాలకు ఈనెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఆ సంస్థ ప్రిన్సిపాల్ రామ్మోహన్‌రావు తెలిపారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమకు సమీపంలోని ఏదైనా ఐటీఐ కేంద్రానికి వెళ్లి, సంబంధిత ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలను పరిశీలించుకోవాలని ఆయన సూచించారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేయని పక్షంలో మెరిట్ జాబితాలో అభ్యర్థుల పేర్లు ఉండవని స్పష్టం చేశారు. మెరిట్ జాబితాలో చోటు దక్కించుకున్న వారికి, మొదటి విడత కౌన్సెలింగ్‌ను అరకు ఐటీఐలో నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9494929704,9494377833 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.


