ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు హెచ్చరిక
పాడేరు: గిరిజనుల మనోభావాలకు వ్యతిరేకంగా, వారి జీవన్మరణ సమస్యగా ఉన్న బాకై ్సట్ తవ్వకాలకు కూటమి ప్రభుత్వం పూనుకుంటే, రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని పాడేరు ఎమ్మెల్యే ఎం. విశ్వేశ్వరరాజు హెచ్చరించారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
రహస్య సర్వేలపై ఆగ్రహం
ఈనెల 18న జర్రెల కొండల్లో బాకై ్సట్ తవ్వకాలకు సంబంధించి అధికారులు రహస్యంగా సర్వేలు చేపట్టి, శాంపిల్స్‌ను సేకరిస్తుండగా స్థానిక గిరిజనులకు అడ్డంగా దొరికిపోయారని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై స్థానిక గిరిజనులు, రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నా, ఇప్పటివరకు ఏ ఒక్క అధికారే స్పందించి స్పష్టత ఇవ్వకపోవడం శోచనీయమని విమర్శించారు. దీంతో గిరిజనులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని ఆయన తెలిపారు.
గిరిజన సంపద దోపిడీకి కుట్ర
ఏజెన్సీలో స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే గెలుస్తుండటంతో, గిరిజనులపై ఉన్న అక్కసుతోనే కూటమి ప్రభుత్వం అడ్డదారిలో వారి సంపదను దోచుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. గిరిజనుల మనుగడకు ఆయువుపట్టుగా ఉన్న 1/70 చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కొందరు 1,700 పిటిషన్లు సుప్రీంకోర్టులో వేశారని, కానీ గిరిజనుల తరపున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం ఒక్క పిటిషన్ కూడా వేయలేదని ఆయన మండిపడ్డారు. గిరిజన చట్టాలను, హక్కులను తుంగలో తొక్కి భూభాగాలను ఆక్రమించుకోవాలనే కుట్రలను గిరిజనులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బాకై ్సట్ తవ్వకాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి స్పష్టత ఇవ్వాలని, లేనిపక్షంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో గిరిజనుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షులు రాంబాబు, మత్స్యకొండం నాయుడు పాల్గొన్నారు.


