జాబ్‌ మేళాలో138 మంది ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాబ్‌ మేళాలో138 మంది ఎంపిక

Jun 25 2026 1:06 AM | Updated on Jun 25 2026 1:06 AM

పాడేరు రూరల్‌: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జేకేసీ ఆధ్వర్యంలో నిర్వహించి జాబ్‌ మేళాలో 138 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికై నట్టు పాడేరు జాయింట్‌ కలెక్టర్‌ తిరుమణి శ్రీపూజ తెలిపారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీకళాశాలలో బుధవారం నిర్వహించిన మెగా జాబ్‌ మేళాలో ఆమె ముఖ్యఅతిథిగా మాట్లాడారు. యువత నైపు ణ్యం పెంపొందించుకోవడంతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ప్రశాంత్‌కుమార్‌, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ చిట్టబ్బాయ్‌, 13 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement