వైఎస్‌ జగన్‌ హయాంలోనే పర్యాటక రంగం అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ హయాంలోనే పర్యాటక రంగం అభివృద్ధి

Jun 25 2026 1:06 AM | Updated on Jun 25 2026 1:06 AM

ఎమ్మెల్సీ డాక్టర్‌ కుంభా రవిబాబు

డుంబ్రిగుడ: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హయాంలోనే పర్యాటక రంగం అభివృద్ధి సాధించిందని ఎమ్మెల్సీ కుంభా రవిబాబు తెలిపారు. 2022–23లో ఐటీడీఏ ద్వారా రూ.80 లక్షలతో చాపరాయిని అభివృద్ధి చేయడంతో పాటు మరెన్నో ప్రాంతాల్లో పర్యాటకుల కోసం సౌకర్యాలు కల్పించారని చెప్పారు. బుధవారం ఆయన చాపరాయిని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయంలో 20 శాతం నిధులను ఆయా పంచాయతీల పరిధిలోని గ్రామాల అభివృద్ధికి కేటాయించారని తెలిపారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అరకులోయ, బొర్రా గుహలు, కొత్తపల్లి, చాపరాయిల ద్వారా వచ్చే ఆదాయంలో ఒక్కరూపాయి కూడా పంచాయతీలకు ఇవ్వడం లేదన్నారు. పర్యాటక రంగంలో పనిచేసే ఉద్యోగులకు పనికి తగిన వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నరావు, పార్టీ ఎస్టీసెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, అరకులోయ ఎంపీటీసీ దురియా ఆనంద్‌కుమార్‌, సీనియర్‌ నాయకులు ఎస్‌.భాస్కరరావు, రాందాస్‌, వి. గురునాయుడు, జి.ప్రకాష్‌, సొనాయి కృష్ణ పాల్గొన్నారు.

కల్తీ ఆహారంపై అప్రమత్తం

అరకులోయ టౌన్‌(పాడేరురూరల్‌): కాలం చెల్లిన, కల్తీ ఆహారపదార్థాల వల్ల ప్రమాదం పొంచి ఉంటుందని, అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్సీ డాక్టర్‌ కుంభా రవిబాబు తెలిపారు. బుధవారం ఆయన అరకులోయలో విలేకరులతో మాట్లాడుతూ వ్యాపారులు కల్తీ ఆహారపదార్థాలను అధికంగా విక్రయిస్తుండడంతో ప్రజలు ప్రాణాంతకమైన వ్యాధులకు గురవుతున్నారు. అధికారులు తనిఖీలు చేయకపోవడం వల్లే కల్తీ, నకిలీ సరుకుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయని చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement