పోరాటాలతోనే సమస్యల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

పోరాటాలతోనే సమస్యల పరిష్కారం

Jun 25 2026 1:06 AM | Updated on Jun 25 2026 1:06 AM

అరకులోయటౌన్‌(పాడేరు రూరల్‌): పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం సాధ్యపడుతుందని ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు అన్నారు. మండల కేంద్రం అరకులోయలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవో నంబర 57 ప్రకారం 2004 కు ముందు నోటీఫై అయిన సుమారు 11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్‌ స్కీం వర్తింపు చేయడం అభినందనీయమన్నారు. అన్ని రంగాల వారికి సౌకర్యంగా ఉండేందుకు అల్లూరి జిల్లాను జోన్‌1లోనే కొనసాగించాలని కోరారు. ఎంపీహెచ్‌ఏల ఐదు నెలల బకాయి వేతనాలు తక్షణం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. డీఏ బకాయిలతో పాటు ఇతర బకాయిలపై రాష్ట్ర కార్యవర్గం చర్చించి భవిషత్‌ ఉద్యమాలకు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో ఏపీ ఎన్జీవో ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు లకె రవింద్రబాబు,ఉపాధ్యక్షుడు బొంజిబాబు,ఉద్యోగుల సంఘం నాయకుడు సంజీవరాజు తదితరులు పాల్గొన్నారు.

ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌

రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement